Ravichandran Ashwin Suggests: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటింగ్ ఆర్డర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ జట్టులో నాలుగో నంబర్ స్థానం కోసం చాలామంది వాషింగ్టన్ సుందర్ పేరును పరిశీలిస్తుండగా, అశ్విన్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక 21 ఏళ్ల యువ సంచలనాన్ని ఆ స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు.

ఆ యువ ఆటగాడు మరెవరో కాదు, సాయి సుదర్శన్. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ ఫినిషర్ పాత్రకు లేదా లోయర్ ఆర్డర్‌లో మెరుగ్గా సరిపోతాడని, కానీ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను సాయి సుదర్శన్‌కు అప్పగించాలని సూచించారు. సాయి సుదర్శన్ గత సీజన్లలో గుజరాత్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడని, టెక్నికల్‌గా ఎంతో పటిష్టంగా ఉండే అతడిని నంబర్ 4 వద్ద పంపితే జట్టుకు భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంటుందని అశ్విన్ విశ్లేషించారు.

అశ్విన్ అభిప్రాయం ప్రకారం, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి క్లాస్ ప్లేయర్లు టాప్ ఆర్డర్‌లో ఉంటే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మరింత బలంగా మారుతుంది. వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్ కావడంతో అతడిని ఫ్లోటర్‌గా ఉపయోగించుకోవచ్చని, అయితే స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సాయి సుదర్శన్ 4వ స్థానానికి సరైన న్యాయం చేస్తాడని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.

Next Story