చివరికి మోసం చేసింది

RCB bowler Yash Dayal: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ ఎట్టకేలకు స్పందించాడు. అంతా ఉత్తదేనని..తననే ఆ యువతి మోసం చేసిందని ..ఆమెపై పోలీసులకు రిటన్ కంప్లైంట్ ఇచ్చిన యశ్ దయాల్.. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరాడు. కంప్లైంట్‎లో యశ్ దయాల్ కీలక విషయాలు ప్రస్తావించాడు.

2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ మహిళతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఒకరితో ఒకరం మాట్లాడుకున్నామని తెలిపాడు. తనపై ఆరోపణలు చేస్తున్న యువతికి ఐఫోన్, రూ.లక్షల్లో నగదు అప్పుగా ఇచ్చా.. కానీ ఇప్పటివరకు ఆమె తిరిగి ఇవ్వలేదన్నాడు. తన కుటుంబసభ్యుల చికిత్స పేరుతోపాటు, షాపింగ్‌కు కూడా తీసుకెళ్లి డబ్బులు కాజేసిందని ఆయన ఆరోపించారు. వీటన్నింటికీ తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు.

పెళ్లి పేరుతో తనను వాడుకుని వదిలేశాడని యశ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ 69 ప్రకారం యశ్ దయాల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో దయాల్ ఆమెపైనే రిటర్ కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story