మూడు నెలల తర్వాత ఎమోషనల్ పోస్ట్

Royal Challengers Bangalore (RCB): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ బెంగళూరులో జరిగిన విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించినది.

మూడు నెలల పాటు తాము సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం ఆ దురదృష్టకర సంఘటనే అని RCB తెలిపింది. ఆ ఘటనపై తాము నిరంతరం బాధపడుతూనే ఉన్నామని తెలిపింది.అభిమానుల కోసం "ఆర్సీబీ కేర్స్" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన,గాయపడిన అభిమానుల కుటుంబాలకు అండగా ఉంటామని, అలాగే సమాజంలో సహాయం అవసరమైన వారికి కూడా తమ మద్దతు ఉంటుందని తెలిపింది.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అభిమానుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. RCB కేవలం ఒక క్రికెట్ జట్టుగా కాకుండా, తమ అభిమానుల పట్ల బాధ్యత కలిగిన సంస్థగా తమను తాము నిరూపించుకుంటామని వెల్లడించింది. RCB కేవలం గెలుపు, ఓటములతో ముడిపడి లేదు. మా అభిమానులు, మా ఆటగాళ్లు, మా టీమ్ అందరూ కలిసి సమాజానికి సేవ చేయడమే మా ప్రధాన లక్ష్యం అని తెలిపింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story