RCB Player: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన రొమారియో షెపర్డ్, ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో 16వ గేమ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ - సియాటిల్ ఓర్కాస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సియాటిల్ ఓర్కాస్ కెప్టెన్ హెన్రిక్ క్లాసెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

సియాటిల్ ఓర్కాస్, 132 పరుగులకు 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును దెబ్బతీసింది. కానీ చివర్లో క్రీజులోకి వచ్చిన రొమారియో షెపర్డ్ చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ రూపమే మార్చేశాడు. తుఫాను బ్యాటింగ్ తో కేవలం 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 విధ్వంసకర సిక్సర్లతో అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో 150 పరుగులకే పరిమితం కావాల్సిన శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 178 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సియాటిల్ ఓర్కాస్ 18.4 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. దీంతో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టు 32 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను చేసిన రొమారియో షెపర్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే చివరి ఓవర్లలో రొమారియో షెపర్డ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటం ఇదే మొదటిసారి కాదు. CSK తో జరిగిన IPL మ్యాచ్ లో అతను కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి, మొత్తం మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. ఇప్పుడు, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో షెపర్డ్ విధ్వంసం కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story