అల్లు అయాన్ సెలబ్రేషన్స్

Allu Arjun: 17 ఏళ్లు అందని ద్రాక్షగా మిగిలి పోయిన ఐపీఎల్ టైటిల్‎ను ఎట్టకేలకు 18వ సీజన్‎లో ఒడిసిపట్టుకుంది. 2025, జూన్ 3న గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో పంజాబ్‎ను చిత్తు చేసి తొలి ఐపీఎల్ టైటిల్‎ను ముద్దాడడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఆర్సీబీ విజయం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో అయాన్ ఎమోషనల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

నీళ్లు మీద పోసుకోవడంతో పాటు.. నేలపై పడుకుని ఎంజాయ్ చేశాడు. తనకు కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని.. మొత్తానికి ఈ సారి కూడా కప్ లాలీ పప్ అని చెప్పలేనని ఫన్నీ కామెంట్ చేశాడు. అల్లు అయాన్ సెలబ్రేషన్స్ వీడియోను ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ అల్లు అర్జు్న్ ఇన్స్ స్టా గ్రామ్‎లో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీనికంటే ముందు.. ‘‘వెయిటింగ్ ఈస్ ఓవర్.- ఈ సాలా కప్ నమ్దూ.18 సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఆర్సీబీకి పెద్ద, పెద్ద అభినందనలు’’ అని అల్లు అర్జున్ పటిదార్ సేనకు విషెస్ తెలియజేశాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story