Pat Cummins: కుమ్మేసిన కమిన్స్.. రికార్డులే రికార్డులు
రికార్డులే రికార్డులు

Pat Cummins: డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆరు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అలాగే టెస్ట్లల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఐసీసీ ఫైనల్స్ లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (18.1ఓవర్లు, 6/28) నమోదు చేసి ఫస్ట్ బౌలర్ రికార్డు లకెక్కాడు.కలిస్ పేరిట (7.3ఓవర్లు, 5/30) ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా (77)ను కమిన్స్ (79) అధిగమించాడు. లార్డ్స్ బెస్ట్ బౌలింగ్ చేసిన కెప్టెన్ కమిన్స్ (6/28) - బాబ్ విల్లీస్(6/101) రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బిషన్ సింగ్ బేడీ (8) రికార్డును కూడా కమిన్స్ (9) తుడిచిపెట్టాడు. ఇమ్రాన్ ఖాన్ (12), రిచీ బెనాడ్
ముందున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో బౌలర్ల హవానే కొనసాగుతోంది. కంగారూల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (6/28) స్వింగ్ దెబ్బకు సఫారీ బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో 43/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 138 రన్స్‌కే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌కు 74 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి144 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఆసిస్ 218 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
