రిషబ్ పంత్ చేతికి గాయం..

Rishabh Pant Injured: భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆధిపత్యం చెలాయించిన టీమిండియాకు షాక్ తగిలింది. మ్యాచ్ మధ్యలో టీమిండియా తన వికెట్ కీపర్‌ను మార్చాల్సి వచ్చింది. రిషబ్ పంత్ కీపింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. దీంతోని అతడు మైదానం విడిచి వెళ్ళాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగాడు. మ్యాచ్ తొలి రోజున పంత్ గాయం జట్టును ఆందోళనకు గురిచేసింది.

పంత్ స్థానంలో జురెల్

నిజానికి, కీపింగ్ చేస్తున్నప్పుడు, బంతి రిషబ్ పంత్ వేలికి తగిలింది. దీని వల్ల పంత్ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. పంత్ పరిస్థితిని చూసిన ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి అతని వేలిపై స్ప్రే చేశాడు. దీని తరువాత కూడా పంత్ నొప్పి తగ్గలేదు. అందువలన, అతను మైదానం వదిలి వెళ్ళవలసి వచ్చింది. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా మైదానంలోకి వచ్చాడు.

పంత్ గాయం టీమిండియాలో ఆందోళన పెంచింది. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో పంత్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఫస్ట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పంత్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పంత్ ఆకట్టుకున్నాడు.

ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాక్‌..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, బెన్ డకెట్, జాక్ క్రౌలీలు అవుట్ చేశారు. డకెట్ 23 పరుగులకు అవుట్ కాగా, క్రౌలీ 18 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జో రూట్ - ఆలీ పోప్ నిలకడగా ఆడుతున్నారు. జట్టును 100 పరుగుల మార్కును దాటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story