Rishabh Pant : సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు రిషబ్ పంత్!
టెస్ట్ సిరీస్‌కు రిషబ్ పంత్!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు తిరిగి ఎంపికయ్యాడు. ఇటీవల గాయం కారణంగా జట్టుకు దూరమైన పంత్, పూర్తి ఫిట్‌నెస్ సాధించి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతుండడం అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే వార్త.
పంత్ గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కుడి కాలికి ఫ్రాక్చర్ కావడంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతను ఆసియా కప్, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లకు అందుబాటులో లేకపోయాడు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపికకు ముందు, పంత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి భారత్-ఎ తరఫున దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన నాలుగు రోజుల అనధికారిక టెస్టులో కెప్టెన్‌గా ఆడాడు.
బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్య చేధనలో కీలకమైన 90 పరుగులు (113 బంతుల్లో) సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శన, పూర్తి ఫిట్‌నెస్ ధ్రువీకరణ తర్వాత సెలక్టర్లు అతన్ని టెస్టు జట్టులోకి తిరిగి తీసుకున్నారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టుకు పంత్‌ను వైస్-కెప్టెన్ గా కూడా ప్రకటించారు.

