Rishabh Pant’s Birthday: రిషబ్ పంత్ బర్త్ డే..బీసీసీఐ స్పెషల్ ట్వీట్..
బీసీసీఐ స్పెషల్ ట్వీట్..
Rishabh Pant’s Birthday: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అక్టోబర్ 4న పంత్ పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
'154 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 5,507 ఇంటర్నేషనల్ రన్స్, వికెట్ కీపర్‌గా, ఫీల్డర్‌గా 250 డిస్మిసల్స్, 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేత, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత, ధైర్యవంతుడైన రిషభ్ పంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ తన పోస్టులో తెలిపింది.
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగవ టెస్టులో రిషబ్ పంత్ ఒక రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించి, క్రిస్ వోక్స్ వేసిన బంతిని మిస్ అయ్యాడు. ఆ బంతి అతని కాలికి తగిలింది, దీనివల్ల అతని కాలికి పగులు ఏర్పడింది. గాయం తీవ్రత దృష్ట్యా, పంత్‌కు ఆరు వారాల విశ్రాంతి తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. అతనికి శస్త్రచికిత్స అవసరం లేదని, అయితే పూర్తి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది.
ఈ గాయం కారణంగా రిషబ్ పంత్ ఆసియా కప్ ఆడలేదు. వెస్టిండీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ కు కూడా దూరంగా ఉన్నాడు.
