అరుదైన ఘనత

Rohit Sharma: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఆదివారం (అక్టోబర్ 19, 2025) ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌తో రోహిత్ శర్మ తన కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు.
ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా 'హిట్‌మ్యాన్' చరిత్ర పుటల్లోకి ఎక్కారు. రోహిత్ కంటే ముందు కేవలం నలుగురు భారత దిగ్గజాలు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు.
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా:
సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లీ (551 మ్యాచ్‌లు)
ఎం.ఎస్. ధోని (535 మ్యాచ్‌లు)
రాహుల్ ద్రవిడ్ (504 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ (500 మ్యాచ్‌లు*)
ప్రపంచ క్రికెట్‌లో ఈ మైలురాయిని చేరుకున్న 11వ ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ నిలిచారు. తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో 49 సెంచరీలు సహా 19,700కు పైగా పరుగులు సాధించి, ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా రోహిత్ శర్మ గుర్తింపు పొందారు.
