Rohit Sharma: వన్డేల్లో టాప్ ప్లేస్ కోల్పోయిన రోహిత్
టాప్ ప్లేస్ కోల్పోయిన రోహిత్

Rohit Sharma: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని కోల్పోయారు.రోహిత్ శర్మ కేవలం ఒక్క పాయింట్ తేడాతో నంబర్ 1 స్థానాన్ని కోల్పోయి రెండవ స్థానానికి పడిపోయారు.
న్యూజిలాండ్‌కు చెందిన బ్యాటర్ డారిల్ మిచెల్ రెండు స్థానాలు ఎగబాకి782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు.రోహిత్ శర్మ 781 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో డారిల్ మిచెల్ అద్భుతమైన శతకం (119 పరుగులు) సాధించడం వలన ఆయన రేటింగ్ పాయింట్లు పెరిగి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు.వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్న రెండో కివీస్ ఆటగాడిగా డారిల్ మిచెల్ నినిలిచాడు. అంతకుముందు 1979లో గ్లెన్ టర్నర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ అద్భుతమైన ప్రదర్శన (ఒక సెంచరీ) చేసి కొన్ని వారాల క్రితమే అగ్రస్థానం చేరుకున్నారు. అయితే, మిచెల్ తాజా ప్రదర్శన కారణంగా రేటింగ్ పాయింట్లలో స్వల్ప తేడా వచ్చి ర్యాంక్ మారింది.ఇతర భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానం, విరాట్ కోహ్లీ ఐదో స్థానం, శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన చేస్తే తిరిగి నంబర్ 1 ర్యాంకును దక్కించుకునే అవకాశం ఉంది.

