ముంబై ఇండియన్స్ క్లారిటీ

Rohit Sharma Moves to Kolkata: గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ ఐపీఎల్ లో ముంబైను వీడి కోల్ కతా నైట్ రైడర్స్ లో చేరుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈప్రచారం నేపథ్యంలో

ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మపై చేసిన ట్వీట్, అతను జట్టును వీడి కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR) లో చేరుతున్నారనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.

ముంబై ఇండియన్స్ తమ అధికారిక 'X' ( ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.

సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడనేది ఖాయం. కానీ (K)రాత్రిలో... కష్టం అది అసాధ్యం! అని ట్వీట్ ద్వారా ముంబై ఇండియన్స్ పరోక్షంగా KKR లోకి వెళ్లడం అసాధ్యం: ట్వీట్‌లో "at (K)night" (K తో కలిపి) అనే పదాన్ని వాడటం ద్వారా, రోహిత్ శర్మ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో (KKR) చేరడం అనేది అసాధ్యం అని పరోక్షంగా చెప్పింది. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ (MI) తోనే కొనసాగుతారని మెసేజ్ ఇచ్చింది.

పోస్ట్‌లో ఉన్న "ముష్కిల్ హి నహీ, నాముమ్కిన్ హై" (కష్టం కాదు, అసాధ్యం!) అనే డైలాగ్‌ను KKR సహ -యజమాని అయిన షారూఖ్ ఖాన్ సినిమాల నుంచి తీసుకున్నారు, దీని ద్వారా మరింత స్పష్టమైన పరోక్ష సందేశాన్ని అందించారు.

ఇటీవల రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌ కోసం KKR కొత్త హెడ్ కోచ్ అయిన అభిషేక్ నాయర్‌తో కలిసి పనిచేయడం, KKR రోహిత్ శర్మను పొగుడుతూ చేసిన ట్వీట్‌ల నేపథ్యంలో ఈ పుకార్లు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఈ ట్వీట్‌తో అన్ని ఊహాగానాలకు తెరదించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story