రోహిత్ టాప్​ ర్యాంక్​..

Rohit Sharma Tops ODI Rankings: టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి 781 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. టాప్ ర్యాంక్ సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్‌‌‌‌గా 38 ఏండ్ల రోహిత్‌‌ చరిత్ర సృష్టించాడు.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడం రోహిత్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది.

ఈ క్రమంలో ఇబ్రహీం జద్రాన్‌‌‌‌‌‌‌‌ (764) ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో మార్పు లేకపోయినా, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (745)ను రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు కిందకు నెట్టాడు. గత దశాబ్దంలో రోహిత్‌‌‌‌‌‌‌‌ ఎక్కువసార్లు టాప్‌‌‌‌‌‌‌‌–10లోనే కొనసాగడం మరో విశేషం. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (725) ఒక్క ప్లేస్‌‌‌‌‌‌‌‌ కిందకు దిగి ఆరో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (700) ఒక్క ర్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగుపడి 9వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (631) 14వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో మార్పులేదు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (634), రవీంద్ర జడేజా (598), సిరాజ్‌‌‌‌‌‌‌‌ (586), షమీ (578) వరుసగా 7, 13, 16, 18వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు. అయితే స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (536) ఆరు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి 31వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌లో అక్షర్‌‌‌‌‌‌‌‌ ఎనిమిదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story