Team India’s Dressing Room: భారత క్రికెట్‌లో మరో సంచలనం! ఇంగ్లండ్ గడ్డపై వరుస వైఫల్యాల నేపథ్యంలో.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గట్టిగా భావిస్తున్నారు. ఈ పరిణామాలతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర విభేదాల సెగ మొదలైంది! ఇప్పుడు వాతావరణం అంతా.. రోహిత్ వర్సెస్ గంభీర్, అగార్కర్ అన్నట్లుగా మారిపోయింది.

దాదాపు 513 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 50 సెంచరీలతో 20 వేలకు పైగా రన్స్ చేసిన రోహిత్‌కు.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని స్వయంగా తీసుకునే హక్కు ఉంది. కానీ, సెలెక్టర్ల ఆలోచన వేరేలా ఉంది. రాబోయే వన్డే వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ జట్టును సిద్ధం చేసే పనిలో వారున్నారు. ఒకవేళ వన్డేల్లో కొనసాగాలని రోహిత్ పట్టుబడితే.. సెలెక్షన్ కమిటీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

ముగ్గురు మొండిఘటాలే..!

రోహిత్, గంభీర్, అజిత్ అగార్కర్.. ఈ ముగ్గురి మధ్య పరస్పర నమ్మకం పూర్తిగా లోపించినట్లు స్పష్టమవుతోంది. గతంలో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు, ఆయన రోహిత్-అగార్కర్ మధ్య ఒక వారధిలా వ్యవహరించారు. ఆ సమన్వయం వల్లే ఇండియా వరల్డ్ కప్స్‌లో అద్భుతాలు చేసింది. కానీ గంభీర్ శైలి ద్రవిడ్‌కు పూర్తిగా భిన్నం. తన నమ్మకాలకు కట్టుబడి ఉండే గంభీర్ రాకతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

2005 నాటి సీన్ రిపీట్ కాబోతోందా?

ప్రస్తుత రోహిత్-గంభీర్ వివాదం.. 2005 నాటి సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాపెల్ వివాదాన్ని తలపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో ఇండియా 0-3తో ఓడినప్పటి నుంచే ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఆస్ట్రేలియా పర్యటన సమయానికి ఇరుపక్షాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సిడ్నీ టెస్ట్‌కు ముందు జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత.. రోహిత్ మీడియా ముఖంగా "నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకేది మంచిదో నాకు తెలుసు" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించడం గంభీర్, అగార్కర్‌లను షాక్‌కు గురిచేసింది.

చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత కెప్టెన్సీ మార్పు

చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన వెంటనే, తదుపరి సిరీస్‌లో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం అతన్ని తీవ్రంగా కలచివేసింది. 2027 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగార్కర్ చెప్పడంతో రోహిత్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఈ గందరగోళం అతని బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా పరుగులు కూడా తగ్గాయి. ఒక పేలవమైన ఇన్నింగ్స్ ఆడిన రోజే రోహిత్‌ను పక్కన పెట్టాలనే వార్తలు రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. మొత్తానికి రోహిత్‌, గంభీర్‌, అగార్కర్‌ ఎపిసోడ్‌ మున్ముందు మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి!

PolitEnt Media

PolitEnt Media

Next Story