Rohit Sharma: ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన కొత్త లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సాధారణంగా కూల్ అండ్ కామ్‌గా ఉండే రోహిత్ శర్మ తాజాగా తన గెటప్‌లో భారీ మార్పు చేసుకున్నారు. చాలా స్టైలిష్ అండ్ క్లాసీ గ్గాడ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఆయన కనిపించిన తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఈ కొత్త లుక్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ మేకోవర్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ మైదానంలో టెన్షన్, రెస్పాన్సిబిలిటీతో కనిపించే రోహిత్.. ఈ కొత్త స్టైలిష్ అవతార్‌లో చాలా యంగ్ అండ్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

క్రికెట్ పిచ్ పైనే కాదు, స్టైల్ విషయంలోనూ తాను ఎప్పుడూ ట్రెండ్ సెట్టరేనని ఆయన మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో నిలవగా, అభిమానులు విపరీతంగా షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ ఈ కొత్త మేకోవర్ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లోనూ, ఇంటర్నెట్‌లోనూ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story