సిడ్నీలో సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్!

Rohit Sharma’s rare chance: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని ఫార్మాట్‌లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి భారత ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డును అధిగమించడానికి రోహిత్ శర్మకు మరో 93 పరుగులు మాత్రమే అవసరం. ప్రస్తుతం, భారత ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 388 ఇన్నింగ్స్‌లలో 15,758 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 376 ఇన్నింగ్స్‌లలో 15,666 పరుగులు చేశాడు. సిడ్నీలో 93 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధిస్తే, సెహ్వాగ్ రికార్డును అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. మొదటి రెండు వన్డేల్లో భారత్ ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, ఈ చివరి వన్డేలో రోహిత్ శర్మ బ్యాట్ నుండి మెరుపు ఇన్నింగ్స్ ఆశించేందుకు అభిమానులకు ఇది ఒక పెద్ద కారణంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక జట్టు తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ , లెజెండరీ బ్యాటర్ సనత్ జయసూర్య పేరు మీద ఉంది. 1993 నుంచి 2011 వరకు జయసూర్య 502 మ్యాచ్‌లు ఓపెనర్‌గా ఆడి 559 ఇన్నింగ్స్‌లలో మొత్తం 19,232 పరుగులు సాధించాడు. అతని తర్వాత క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, గ్రేమ్ స్మిత్, డెస్మండ్ హేన్స్, సెహ్వాగ్ ఉన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story