సంచలన కామెంట్స్

Rohit Sharma's Sensational Comments: వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత తొలిసారిగా బహిరంగంగా మాట్లాడిన రోహిత్ శర్మ, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం నుంచి 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లు గెలవడం వరకు జట్టు ప్రయాణం గురించి మాట్లాడారు. ఈ విజయంలో రాహుల్ ద్రవిడ్ ఏర్పాటు చేసిన పద్ధతులు సహాయపడ్డాయని రోహిత్ అభిప్రాయపడ్డారు. భారత జట్టు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ జట్టు విజయాన్ని గురించి మాట్లాడే క్రమంలో గంభీర్ పేరును ప్రస్తావించకపోవడం సంచలనం సృష్టించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ విజయం గురించి మాట్లాడుతూ, రోహిత్ శర్మ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో మొదలైన ప్రాసెస్ , టీమ్ స్ఫూర్తికి క్రెడిట్ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ పేరును పూర్తిగా విస్మరించారు.ఇది ఒక సంవత్సరం లేదా రెండేళ్ల పని కాదు. చాలా ఏళ్లుగా చేస్తున్న కృషి. అంతకుముందు ద్రవిడ్ ఆధ్వర్యంలో మేము చేసిన ప్రణాళికలు, జట్టులో తీసుకువచ్చిన మార్పులే ఈ విజయాన్ని ఇచ్చాయి. జట్టులో ప్రతి ఒక్కరూ ఒకే ఆలోచనతో ఉన్నందున ఇది సాధ్యమైంది అని రోహిత్ అన్నారు.

శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీని అప్పగించిన తర్వాత రోహిత్ శర్మ మొదటిసారి బహిరంగంగా మాట్లాడారు. "నాకు ఆ జట్టుతో ఆడటం అంటే చాలా ఇష్టం. ఇది మా అందరి ప్రయాణం. ఏ క్రికెటర్‌కైనా దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే జోక్ కాదు, అది అత్యంత గౌరవప్రదమైన విషయం. టీమ్‌కు ఏం అవసరమో అది చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్ గెలవడమే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది" అని అన్నారు.

కోచ్ గౌతమ్ గంభీర్‌తో విభేదాలు ఉన్నాయనే వార్తలను కొట్టిపారేస్తూ, "మా ఇద్దరి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మైదానంలో ఏం చేయాలనేది నాపై గౌతమ్ గంభీర్‌కు పూర్తి నమ్మకం ఉంటుంది. ఆఫ్-ఫీల్డ్ (మైదానం వెలుపల) మాత్రమే మా మధ్య చర్చ జరుగుతుంది. అది చాలు" అని వివరణ ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story