రోహిత్ రికార్డ్

Rohit’s Record on Australian Soil: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో (ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై) రోహిత్ శర్మ 73 పరుగులు చేసి, ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారానే అతను ఆస్ట్రేలియా గడ్డపై 1,000 పరుగుల రికార్డును అందుకున్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై, ఆస్ట్రేలియా జట్టుపై వన్డేల్లో 1,000 పరుగులు మైలురాయిని చేరుకున్న మొదటి భారత బ్యాటర్ రోహిత్ శర్మ.

ఆస్ట్రేలియాపై రోహిత్ మెరుగైన బ్యాటింగ్ సగటును (Average) కలిగి ఉన్నాడు.ఇది 55 కంటే ఎక్కువగా ఉంది.ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాపై వన్డేల్లో భారత బ్యాటర్లలో అత్యధిక సెంచరీలు (4) చేసినవారిలో రోహిత్ ముందున్నాడు (విరాట్ కోహ్లీతో సమానంగా).అతని అత్యధిక స్కోరు 171 కూడా ఆస్ట్రేలియాలో నమోదు అయ్యింది.ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ రోహిత్ శర్మ. అతని ఖాతాలో 8 సెంచరీలు ఉన్నాయి.

ఈ వన్డేలో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అడిలైడ్ ఓవల్ లోజరిగిన ఈ వన్డేలో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story