SA20 Auction: సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం.. బ్రెవీస్ రికార్డు ధర
బ్రెవీస్ రికార్డు ధర

SA20 Auction: సౌత్ ఆఫ్రికాలో జరిగే ఎస్ఏటీ20 లీగ్ నాలుగో సీజన్ వేలంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీవాల్డ్ బ్రెవీస్, ఎయిడెన్ మార్కరం భారీ ధర పలికారు. డీవాల్డ్ బ్రెవీస్‌ను ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు రికార్డు ధర అయిన 16.5 మిలియన్ రాండ్‌లు (సుమారు రూ. 8.3 కోట్లు) చెల్లించి కొనుగోలు చేసింది. ఇది ఎస్ఏటీ20 లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర. గతంలో త్రిస్తాన్ స్టబ్స్ పేరిట ఉన్న 9.2 మిలియన్ రాండ్‌ల (రూ. 4.6 కోట్లు) రికార్డును బ్రెవీస్ బద్దలు కొట్టాడు.
ఈ భారీ ధరకు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం, బ్రెవీస్ అద్భుతమైన ఫామ్ అని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్కరంను డర్బన్ సూపర్‌జైంట్స్ జట్టు 14 మిలియన్ రాండ్‌లు (సుమారు రూ. 7 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది.
ఈ ధరతో ఎస్ఏటీ20 లీగ్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో మార్కరం రెండో స్థానంలో నిలిచాడు.
మార్కరం తన నాయకత్వ లక్షణాలు , బ్యాటింగ్‌లో స్థిరమైన ఆటతీరు కారణంగా ఈ భారీ ధర పలికాదడు. ఈ వేలంలో దక్షిణాఫ్రికా యువ,అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు భారీ ధరలు పలకడం విశేషం. ఇది దేశీయ క్రికెట్‌కు, లీగ్‌కు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
