Sachin's Son Gets Engaged: ఘనంగా సచిన్ కొడుకు నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
అమ్మాయి ఎవరంటే?

Sachin's Son Gets Engaged: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక బుధవారం జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా గోప్యంగా, కేవలం ఇరు కుటుంబాల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో మాత్రమే జరిగింది. సానియా చందోక్ ముంబైలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు. ఆమె తాత రవి ఘాయ్, హాస్పిటాలిటీ ఆహార రంగాలలో పేరుపొందిన వ్యక్తి. వీరికి ఇంటర్ కాంటినెంటల్ హోటల్, ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీ వంటి వ్యాపారాలు ఉన్నాయి. సానియా కూడా ఒక వ్యవస్థాపకురాలు. ఆమె పెంపుడు జంతువుల చర్మ సంరక్షణ, స్పా బ్రాండ్ అయిన Mr. Pawsని స్థాపించారు. ఈ నిశ్చితార్థంపై టెండూల్కర్ కుటుంబం కానీ, చందోక్ కుటుంబం కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా అర్జున్ టెండూల్కర్ క్రికెటర్. ఆయన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్.దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిస్ట్-ఎ మరియు 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో, ఇతను 33.51 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. 23.13 సగటుతో మొత్తం 532 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో, అర్జున్ 25 వికెట్లు (సగటున 31.2) మరియు 102 పరుగులు (సగటున 17) మాత్రమే అర్జున్ పేరు మీద ఉన్నాయి. ఇక టీ20ల విషయానికి వస్తే.. అర్జున్ టెండూల్కర్ 25.07 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. 13.22 సగటుతో 119 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
