ఆరు వారాలు క్రికెట్ కు దూరం

Sai Sudharsan: టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ పక్కటెముక గాయం కారణంగా సుమారు 6 నుండి 8 వారాల పాటు క్రికెట్‌కు దూరమయ్యారు.

విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు తరఫున ఆడుతున్నప్పుడు, ఒక రన్ తీసే క్రమంలో డైవింగ్ చేయడంతో అతడి పక్కటెముకకు గాయమైంది.కుడి వైపు 7వ పక్కటెముక ముందు భాగంలో స్వల్ప ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలింది.ఈ గాయం నయం కావడానికి కనీసం ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం సాయి సుదర్శన్ బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కోలుకుంటున్నారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ పొందుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు మరియు త్వరలో జరగబోయే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు కూడా అతను దూరమయ్యే అవకాశం ఉంది.

అయితే, మార్చి చివరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 నాటికి సాయి సుదర్శన్ పూర్తిగా కోలుకుని, గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.గత కొద్ది కాలంగా టెస్టుల్లో మరియు దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌కు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story