గుడ్ బై చెప్పిన సైనా

Saina Nehwal: ఇండియా లెజెండరీ షట్లర్, ఒలింపిక్స్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌లో దేశానికి తొలి పతకం అందించిన మాజీ వరల్డ్ నంబర్ వన్ సైనా నెహ్వాల్ కెరీర్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పింది. రెండేండ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న ఈ హైదరాబాదీ.. మోకాలి సమస్య వల్లే ఆట ఆపేశానని వెల్లడించింది. రెండు గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకోవడం నాకిప్పుడు కష్టమవుతోంది. నా శరీరం అందుకు సహకరించడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

సైనా నేహ్వాల్ కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు, భారత్‌లో బ్యాడ్మింటన్ క్రేజ్‌ను పెంచిన అసలైన స్టార్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి, బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని అందుకున్న ఏకైక భారతీయ మహిళా క్రీడాకారిణి. ఆమె తన కెరీర్‌లో మొత్తం 24 అంతర్జాతీయ టైటిల్స్‌ను గెలుచుకున్నారు. ఇందులో సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న మరియు అర్జున అవార్డులతో గౌరవించింది.సైనా నేహ్వాల్ సాధించిన విజయాలు పి.వి. సింధు, లక్ష్య సేన్ వంటి ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చాయి. ఆట నుంచి ఆమె తప్పుకున్నా, భారత క్రీడా చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.

Updated On 20 Jan 2026 11:00 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story