Sanju Samson: ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఫ్యూచర్ కెప్టెన్సీ గురించి లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

చెన్నై టీమ్ ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నైకి వైస్ కెప్టెన్‌గా తీసుకురావాలని కుంబ్లే సూచించారు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఆ వికెట్ కీపింగ్ బాధ్యతలు, కూల్ కెప్టెన్సీని హ్యాండిల్ చేయగలిగే సత్తా కేవలం సంజూకే ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. రుతురాజ్ గైక్వాడ్‌కు తోడుగా సంజూ ఉంటే.. CSK మళ్ళీ పాత వైభవాన్ని అందుకుంటుందని విశ్లేషించారు.

అంతేకాదు, సంజూ శాంసన్ సౌత్ ఇండియా కనెక్ట్ వల్ల చెన్నై ఫ్యాన్ బేస్ మరింత పెరుగుతుందని కుంబ్లే అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎల్లిస్ ప్లేస్‌లో దుష్మంత చమీర లేదా మ్యాట్ హెన్రీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా ఈ సీజన్‌లో చెన్నై టీమ్ కాంబినేషన్ పూర్తిగా మారిపోయేలా కనిపిస్తోంది."

PolitEnt Media

PolitEnt Media

Next Story