Sanju Samson: యువ ఆటగాళ్లతో పోటీపై స్పందించిన సంజు శాంసన్.. సోషల్ మీడియా ట్రోల్స్‌కు అదిరిపోయే రిప్లై!
అదిరిపోయే రిప్లై!

Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తాజాగా తనపై వస్తున్న విమర్శలు, యువ ఆటగాళ్లతో పోటీపై చాలా స్పష్టంగా స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆయన, తనపై జరుగుతున్న చర్చలకు మైక్-డ్రాప్ స్టేట్‌మెంట్‌తో ఫుల్‌స్టాప్ పెట్టారు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభం అందించారు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసిన సంజు, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రదర్శనతో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో తనకున్న పోటీపై వస్తున్న వార్తలకు తెరపడింది.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో ఓపెనింగ్ స్థానాల కోసం జరుగుతున్న పోటీపై స్పందించాలని కోరగా.. సంజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "బయటి ప్రపంచానికి మాత్రమే మేమంతా పోటీదారులు, కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో మేమంతా ఒకే జట్టు. దేశం కోసం ఆడుతున్నాం" అని ఆయన పేర్కొన్నారు. ముందుగా జట్టు గెలుపు ముఖ్యం అని, ఎవరికి అవకాశం దక్కింది, ఎవరికి దక్కలేదనే విషయాలపై నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో, మాజీ క్రికెటర్ల నుంచి వస్తున్న కామెంట్లపై కూడా ఆయన మాట్లాడారు. "నేను వీలైనంత వరకు వై-ఫై ఆఫ్‌లో ఉంచడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు వై-ఫై ఆన్ అయ్యి సీనియర్ ఆటగాళ్లు చెప్పే కామెంట్లు కనిపిస్తుంటాయి. అయితే ఇదంతా సాధారణమే" అని తెలిపారు. భారత్‌లో బయటి నుంచి వచ్చే విమర్శలు ఆటగాళ్లపై ప్రభావం చూపుతాయని, కానీ మైండ్‌సెట్ విషయంలో మాత్రం చాలా స్పష్టత ఉండాలని సంజు శాంసన్ అభిప్రాయపడ్డారు.

