సంజూ రికార్డ్..

Sanju Samson: సంజూ శాంసన్ సోషల్ మీడియా గ్రాఫ్ ఇప్పుడు రాకెట్‌లా దూసుకెళ్తోంది. టీ20 ప్రపంచకప్‌లో ఆయన చూపిన విశ్వరూపం కేవలం మైదానానికే పరిమితం కాలేదు, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది.

సూపర్-8 ముందు 12.1 మిలియన్లు ఉండగా.. ప్రస్తుతం (టోర్నీ ముగిశాక) 17.5 మిలియన్లుగా ఉంది. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే 5.4 మిలియన్ల (54 లక్షలు) కొత్త ఫాలోవర్లు వచ్చి చేరారు.ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం సాధించిన వెంటనే, కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్ (10 లక్షల) మంది ఫాలోవర్లు పెరగడం ఒక అరుదైన రికార్డు. ఇది ఆయనపై అభిమానులకున్న ప్రేమాభిమానాలను చాటి చెబుతోంది.

వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో మొదలైన ఆయన జోరు, సెమీఫైనల్,ఫైనల్‌లోనూ కొనసాగింది. గతంలో సంజూకు సరైన అవకాశాలు రావడం లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. ఇప్పుడు ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో ఒకడిగా (321 పరుగులు) నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలవడంతో అందరూ ఆయనకు ఫిదా అయిపోయారు.

321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ దక్కింది. ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో ఓపెనర్‌గా చోటు వచ్చింది. ప్రస్తుత టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత సోషల్ మీడియాలో అత్యంత వేగంగా ఫాలోవర్లను పెంచుకుంటున్న క్రికెటర్లలో సంజూ ఒకరిగా నిలిచారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story