Sara Tendulkar: నా కూతురి విజయం పట్ల గర్వంగా ఉంది: సచిన్
గర్వంగా ఉంది: సచిన్

Sara Tendulkar: సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. సారా టెండూల్కర్ తన సొంత పైలేట్స్ స్టూడియోను ముంబైలోని అంధేరి ప్రాంతంలో ప్రారంభించారు. ఇది ఒక వెల్‌నెస్ సెంటర్. ఫిట్‌నెస్. ఈ స్టూడియో ప్రారంభం గురించి సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, కుమార్తె సాధించిన ఈ విజయం పట్ల ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఇది ఆమెకు ఒక స్వతంత్ర వ్యాపారవేత్తగా మొదటి అడుగు. లండన్‌లో చదువుకునేటప్పుడు ఆమెకు పైలేట్స్‌పై ఆసక్తి పెరిగిందని, ఇప్పుడు దానిని ఒక వెల్‌నెస్ కేంద్రంగా దేశానికి తీసుకువస్తున్నారని తెలిపారు.
ఈ-క్రికెట్ ఫ్రాంచైజీ ఓనర్‌షిప్
సారా టెండూల్కర్ గ్లోబల్ ఈ -క్రికెట్ ప్రీమియర్ లీగ్ (GEPL) సీజన్ 2లో ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సారా టెండూల్కర్ తన తండ్రి స్థాపించిన సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (STF) లో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. లండన్ యూనివర్సిటీ కాలేజీలో క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సారా, ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, క్రీడల రంగాల్లో సామాజిక సేవలకు కృషి చేస్తున్నారు.
వ్యాపారాలతో పాటు, సారా టెండూల్కర్ మోడలింగ్ రంగంలో కూడా అడుగు పెట్టారు. పలు ప్రముఖ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల, ఆస్ట్రేలియా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఒక భారీ ప్రచారానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమితులయ్యారు.
