సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త చరిత్ర..

Sarfaraz Khan Creates New History: విజయ్ హజారే ట్రోఫీ (2025-26)లో ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. అంతకుముందు అజిత్ సేథ్ (బరోడా), అభిజిత్ కాలే (మహారాష్ట్ర) పేరిట ఉన్న 16 బంతుల రికార్డును సర్ఫరాజ్ బద్దలు కొట్టారు.

మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 62 పరుగులు చేశారు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.అభిషేక్ శర్మ వేసిన ఒకే ఓవర్‌లో సర్ఫరాజ్ 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాది ఏకంగా 30 పరుగులు రాబట్టారు.

సర్ఫరాజ్ ఖాన్,శ్రేయస్ అయ్యర్ (45 పరుగులు) రాణించినప్పటికీ, ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబై జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. పంజాబ్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై, 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.డిసెంబర్ 31న గోవాపై 56 బంతుల్లోనే సెంచరీ బాది (మొత్తం 157 పరుగులు), రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టారు.ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌ల్లో 303 పరుగులు చేశారు. ఐపీఎల్ 2026 వేలంలో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.75 లక్షలకు దక్కించుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story