Duleep Trophy: దులీప్ ట్రోపీ నుంచి సర్పరాజ్ ఔట్
సర్పరాజ్ ఔట్

Duleep Trophy: టీమిండియా క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ తొడకండరాల గాయం కారణంగా దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. అతనికి క్వాడ్రిసెప్స్ గాయం అయ్యింది. ఈ గాయం వల్ల అతను మూడు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది.
సర్పరాజ్ ఈ గాయాన్ని ఇటీవల బుచి బాబు టోర్నమెంట్‌లో హర్యానా జట్టుతో ఆడుతున్నప్పుడు చేసుకున్నాడు. ఈ గాయం కారణంగా దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున ఆడాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌ను అతను మిస్ అవుతాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్నాడు.
అధిక బరువు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన సర్ఫరాజ్, ఇటీవల కాలంలో తన ఫిట్‌నెస్‌పై తీవ్రంగా దృష్టి పెట్టాడు. కేవలం రెండు నెలల కాలంలోనే అతను 17 కిలోల బరువు తగ్గి, స్లిమ్‌గా మారాడు. ఈ మార్పుతో అతను తిరిగి టెస్ట్ జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపాడు. ఇంతలోనే ఈ గాయం వల్ల భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావడానికి ఎదురుచూస్తున్న సమయంలో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
