Second Test Against West Indies: విండీస్ తో రెండో టెస్ట్.. జైశ్వాల్ బద్దలు కొట్టిన రికార్డులివే..
జైశ్వాల్ బద్దలు కొట్టిన రికార్డులివే..

Second Test Against West Indies: వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రికార్డ్ సృష్టించాడు. 23 ఏళ్ల వయస్సులోనే ఐదుసార్లు 150+ స్కోర్‌లు నమోదు చేశాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (8) తర్వాత ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నాడు.వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 173* పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
మొత్తం మీద, 24 ఏళ్ల లోపు అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా సచిన్ టెండూల్కర్ (11), బ్రాడ్‌మన్ (12) గార్ఫీల్డ్ సోబర్స్ (9) తర్వాత జైస్వాల్ (7) వ స్థానంలో ఉన్నాడు. 24 ఏళ్ల లోపు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (7) సాధించిన భారత ఓపెనర్‌గా, ప్రపంచంలో గ్రేమ్ స్మిత్‌తో (7) సంయుక్తంగా అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్‌గా నిలిచాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న మొదటి రోజు ఇండియానే పై చేయి సాధించింది. రెండో రోజు జైశ్వాల్ డబుల్ సెంచరీపై కన్నేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఏకంగా 173 పరుగులతో ఇంకా క్రీజులోనే ఉన్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (20) తో కలిసి స్కోర్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
