ఐదో టీ20లో శ్రీలంకపై భారత్ గ్రాండ్ విక్టరీ

Series Clean Sweep: తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది.ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో అరుంధతి రెడ్డి కేవలం 11 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచింది.176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. హసిని పెరీరా (65), ఇమేషా దులానీ (50) హాఫ్ సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది.

ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ ఒక వికెట్ తీయడం ద్వారా మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (152) తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది .ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (5వ టీ20)హర్మన్‌ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ షెఫాలీ వర్మ (సిరీస్‌లో 241 పరుగులు)కు దక్కింది. ఈ క్లీన్ స్వీప్ విజయంతో భారత జట్టు 2025 ఏడాదిని ఘనంగా ముగించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story