ఆస్పత్రిలో చేరిన శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer Admitted to Hospital: భారత క్రికెటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ అయిన శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలోఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు (బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో క్యాచ్ పట్టిన సమయంలో) కింద పడటంతో ఆయనకు పక్కటెముకల (Rib Cage) ప్రాంతంలో గాయమైంది.

ఆసుపత్రిలో చేసిన వైద్య పరీక్షల్లో ఆయన పక్కటెముకల లోపల, ముఖ్యంగా ప్లీహం (Spleen) వద్ద అంతర్గత రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించారు. అంతర్గత రక్తస్రావం కారణంగా సంక్రమణ (Infection) వ్యాప్తి చెందకుండా, కీలక శరీర పారామితులు స్థిరంగా లేకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆయన ఆరోగ్యం నిలకడగా (Medically Stable) ఉందని , కోలుకుంటున్నారని బీసీసీఐ మెడికల్ టీమ్ తెలిపింది. ఈ గాయం మరింత తీవ్రమై ఉంటే ప్రాణాంతకం అయ్యే ప్రమాదం కూడా ఉండేదని కొన్ని వర్గాలు తెలిపాయి.ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని, అప్పటి వరకు సిడ్నీలోనే ఆసుపత్రిలో ఉండవచ్చని సమాచారం.బీసీసీఐ వైద్య బృందం సిడ్నీ, భారతదేశంలోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story