నా కెరీర్ ఫినిష్

Shikhar Dhawan: టీమ్ ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ 2022లో చేసిన డబుల్ సెంచరీతో తన కెరీర్ ముగిసినట్లు భావించానని మాజీ ప్లేయర్ శిఖర్ ధవన్ తెలిపాడు. తాను అనుకున్నట్లుగానే ఆ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు .

నేను చాలాసార్లు 50, 70ల్లో ఔటయ్యా. వాటిని సెంచరీలుగా మలచలేకపోయా. అదే సమయంలో ఇషాన్ ద్విశతకం బాదాడు. ఇక నా పని అయిపోయిందని ఫీల్ అయ్యా అని అన్నాడు. ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను అని శిఖర్‌ ధావన్‌ చెప్పాడు.

2024 ఆగష్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు ధావన్ వీడ్కోలు పలికాడు. శిఖర్ ధావన్ తన కెరీర్ లో 34 టెస్టులు ఆడి 2315 పరుగులు చేశారు. ఇందులో 7 సెంచరీలు,5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 68 టీ20 ఆడిన ధావన్ 1759 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story