Shikhar Dhawan: శిఖర్ ధవన్‌కు ఈడీ నోటీసులు
ఈడీ నోటీసులు

Shikhar Dhawan: మాజీ భారత క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ అయిన 1xBetతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగానే ధవన్‌కు నోటీసులు పంపారు ఈ యాప్‌ను ధవన్ ఎండార్స్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ కోసం ఈడీ ఆయనకు సమన్లు పంపింది. ఈడీ కార్యాలయంలో ధవన్ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. ఈ యాప్‌తో ఆయనకున్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ ఆరా తీస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ క్రికెటర్ సురేష్ రైనా, నటుడు రానా దగ్గుబాటి వంటి పలువురు ప్రముఖులను కూడా ఈడీ విచారించింది. ఈ కేసులో భాగంగా ఈడీ అనేక అక్రమ బెట్టింగ్ యాప్‌లపై దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్‌లు ప్రజల నుంచి కోట్లాది రూపాయలను మోసం చేసి, భారీగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
