షాక్!

Shock for South Africa: టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా, కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అతని పోరాట పటిమతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో గౌరవప్రదమైన 175 పరుగులు చేయగలిగింది.
అయితే, 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (2 వికెట్లు), ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (2 వికెట్లు) ఆరంభంలోనే సఫారీ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. వీరితో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా తలా రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా, సౌతాఫ్రికా జట్టు కేవలం 15.3 ఓవర్లలోనే 74 పరుగుల అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఈ ఘన విజయంతో టీమిండియా సిరీస్‌ను ఉత్సాహంగా ఆరంభించింది. హార్దిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.

