Key Announcement from BCCI: ఆసుపత్రి నుంచి శ్రేయస్ అయ్యర్ డిశ్చార్జ్! బీసీసీఐ కీలక ప్రకటన
బీసీసీఐ కీలక ప్రకటన

Key Announcement from BCCI: భారత క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యానికి సంబంధించి అభిమానులకు ఉపశమనం కలిగించే వార్త అందింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా తీవ్ర గాయానికి గురైన శ్రేయస్ అయ్యర్, సిడ్నీలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్‌కు పొత్తికడుపునకు గాయం కావడంతో, ప్లీహానికి చీలిక ఏర్పడి అంతర్గత రక్తస్రావం జరిగింది. గాయాన్ని వెంటనే గుర్తించి, వైద్యులు తక్షణమే మైనర్ ప్రక్రియ ద్వారా రక్తస్రావాన్ని అరికట్టారు. ఆయనకు తగిన వైద్య చికిత్స అందించబడింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ స్థిరంగా ఉన్నారు, బాగా కోలుకుంటున్నారు. సిడ్నీలోని వైద్య నిపుణులు, భారత్‌లోని వైద్య నిపుణులు మరియు బీసీసీఐ వైద్య బృందం ఆయన కోలుకునే విధానంపై సంతృప్తి వ్యక్తం చేశాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, తదుపరి వైద్య సంప్రదింపుల కోసం ఆయన సిడ్నీలోనే ఉంటారు. విమానంలో ప్రయాణించడానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని వైద్యులు నిర్ధారించిన తర్వాతే ఆయన భారత్‌కు తిరిగి రానున్నారు. శ్రేయస్ త్వరగా కోలుకోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఆయన ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.

