శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer Recovering Well: టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయాస్ అయ్యర్ పక్కటెముకల ప్రాంతంలో (ఎడమ వైపు) బలంగా పడటం వలన ప్లీహానికి (Spleen) చీలిక ఏర్పడింది. దీని కారణంగా అంతర్గత రక్తస్రావం జరిగింది.గాయం తీవ్రత దృష్ట్యా ఆయనను వెంటనే సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూ (ICU) లో చేర్చారు. వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే రక్తస్రావాన్ని నియంత్రించగలిగారు.

బీసీసీఐ (BCCI) శ్రేయాస్ అయ్యర్ స్వయంగా ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా (Stable) ఉంది . వేగంగా కోలుకుంటున్నారు. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు కూడా మార్చారు."నేను ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నాను . రోజురోజుకూ మెరుగుపడుతున్నాను. మీరు అందించిన మద్దతుకు, నా గురించి ఆలోచించినందుకు నేను చాలా కృతజ్ఞుడను" అని శ్రేయాస్ అయ్యర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు.

శ్రేయాస్సాధారణంగా 6 నుంచి 12 వారాలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆయన దక్షిణాఫ్రికాతో రాబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. బీసీసీఐ వైద్య బృందం ఆయన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. త్వరలోనే ఆయనను భారతదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story