కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..?

Shreyas Iyer: టీమిండియా ప్రధాన జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్న శ్రేయస్ అయ్యర్‌కు ఇప్పుడు ఒక కొత్త బాధ్యత అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్‌ స్క్వాడ్‌లో చోటు దక్కని నేపథ్యంలో, శ్రేయస్ అయ్యర్‌ను ఇండియా-A జట్టుకు కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆస్ట్రేలియా-Aతో సిరీస్‌

వచ్చే వారం ఆస్ట్రేలియా-A జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆ జట్టు ఇండియా-Aతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. లఖ్‌నవూలోని ఏక్‌నా స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన స్క్వాడ్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించనప్పటికీ, శ్రేయస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.

దులీప్ ట్రోఫీలో శ్రేయస్ ప్రదర్శన

ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరఫున ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, తన బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అదే మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (184) భారీ శతకం సాధించగా, యశస్వి జైస్వాల్ (4) నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసిన రుతురాజ్, శార్దూల్ ఠాకూర్ (64), జగదీశన్, రజత్ పటీదార్‌లకు ఆస్ట్రేలియా-Aతో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story