Shresth Iyer: భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు కాలం కలిసిరావడం లేదు. ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లాండ్‌తో రెండు టీ20 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఓడిపోవడం... మరో మ్యాచ్ రద్దు కావడంతో... శ్రేయస్ కెప్టెన్సీ సామర్థ్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, తన సోదరుడిపై వస్తున్న విమర్శలను శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ గట్టిగా తిప్పికొట్టారు. ప్రతి క్రీడాకారుడి కెరీర్‌లోనూ ఇలాంటి క్లిష్టదశ కామనే అని స్పష్టం చేశారు. దిగ్గజ క్రికెటర్లయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు... ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ కూడా ఎన్నో ఓటములను చవిచూశారని ఆమె గుర్తుచేశారు.

విమర్శకులు ఎప్పుడూ శ్రేయస్‌నే తప్పుబడుతూ ఉంటే... సమస్య అతడిలో కాదు, మీలోనే ఉండొచ్చు" అంటూ శ్రేష్ఠ ఘాటుగా స్పందించారు. శ్రేయస్ అద్భుతమైన ఆటగాడని, జట్టుకు ఎంతో విలువైన సహకారాన్ని అందించగలడని కొనియాడారు. ఇప్పుడున్న గడ్డు కాలం ఎల్లకాలం ఉండదని, త్వరలోనే శ్రేయస్ కెప్టెన్సీలో భారత్ విజయాల బాట పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పుడు విమర్శిస్తున్న వారే... రాబోయే రోజుల్లో శ్రేయస్ అయ్యర్‌ను భారతదేశపు అత్యుత్తమ సారథుల్లో ఒకరిగా ప్రశంసిస్తారంటూ తన సోదరుడికి కొండంత అండగా నిలిచారు శ్రేష్ఠ. మరి ఈ విమర్శలను దాటుకుని శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు గెలుపు రుచి చూస్తాడో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story