వన్డే కెప్టెన్సీ.?

Shubman Gill: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవల (జులై 2025) ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టెస్ట్‌లో 269, 161 పరుగులు చేసి, ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 150+ పరుగులు చేసిన టెస్ట్ చరిత్రలో రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్ట్ మ్యాచ్‌ను గెలిచిన అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ICC ర్యాంకింగ్స్ లో టెస్ట్ బ్యాటింగ్ లో కెరీర్ బెస్ట్ 6వ స్థానానికి చేరుకున్నాడు. ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 1వ స్థానంలో కొనసాగుతున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story