రేసులో శుభ్ మన్ గిల్

ICC Award: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ( జూలై ) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను, అతడికి ఈ అరుదైన గౌరవం లభించింది. ఇది గిల్‌కు నాలుగోసారి ఈ అవార్డుకు నామినేట్ కావడం విశేషం.

గిల్ ఇంతకు ముందు 2023 జనవరి, సెప్టెంబర్ ,2025 ఫిబ్రవరి నెలలకు ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి ఈ అవార్డును అందుకోవాలని ఆశిస్తున్నాడు. అతడితో పాటు ఈ రేసులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ,సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ కూడా ఉన్నారు.

శుభ్‌మన్ గిల్ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ సిరీస్‌లో మొత్తం నాలుగు శతకాలు సాధించాడు.లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో 147 పరుగులు

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో 269 ,161 పరుగులు (ఒకే టెస్టులో రెండు శతకాలు), మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో 103 పరుగులు

ఈ సిరీస్‌లో గిల్ మొత్తం 754 పరుగులు సాధించి, సునీల్ గవాస్కర్‌ రికార్డును బద్దలు కొట్టి, ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాకుండా, కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా కూడా చరిత్రకెక్కాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story