Mohammed Siraj: సిరాజ్ కు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్

Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ సిరాజ్కు ప్రతిష్టాత్మకమైన 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్' (ఆగస్టు నెల) అవార్డు లభించింది. ఆగస్టు నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ కీలకమైన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లు తీశారు. ఆ మ్యాచ్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించి, సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో తోడ్పడ్డారు.
అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శనకు గాను ఆ మ్యాచ్‌లో సిరాజ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా గెలుచుకున్నారు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం సిరాజ్, న్యూజిలాండ్ ఆటగాడు మాట్ హెన్రీ, వెస్టిండీస్ ఆటగాడు జైడెన్ సీల్స్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. కానీ, తన అద్భుతమైన ప్రదర్శనతో వారిద్దరినీ అధిగమించి ఈ అవార్డును దక్కించుకున్నారు.సిరాజ్ ఈ అవార్డును తన సహచరులు, కోచింగ్ సిబ్బందికి అంకితం చేశారు. ఈ అవార్డు రాబోయే రోజుల్లో మరింత కష్టపడి మెరుగైన ప్రదర్శన చేయడానికి తనకు స్ఫూర్తినిస్తుందన్నారు.నిర్ణయాత్మక సమయాల్లో నేను అద్భుతమైన స్పెల్స్ వేసినందుకు గర్వపడుతున్నా. వాళ్ల దేశంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌కు బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది అని సిరాజ్ అన్నాడు.
