అర్హత సాధించిన అతి చిన్న దేశం

FIFA World Cup: కరీబియన్ దీవి దేశమైన కురాకో 2026లో జరగబోయే FIFA ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఈ విజయం ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం. కేవలం 1,56 వేల మంది జనాభా మాత్రమే ఉన్న కురాకో ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశంగా (జనాభా పరంగా) రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఐస్‌లాండ్ (2018లో 3లక్షల50 వేల జనాభా) పేరిట ఉండేది. నవంబర్ 18న జరిగిన CONCACAF క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఈ అర్హత ఖరారైంది. తుది క్వాలిఫయర్ మ్యాచ్‌లో కురాకో... జమైకాపై 0-0 తేడాతో డ్రా చేసుకుంది. గ్రూప్‌లో అగ్రస్థానం దక్కించుకోవడానికి ఈ ఒక్క పాయింట్ వారికి సరిపోయింది.

జమైకాపై జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. జమైకా మూడుసార్లు పోస్ట్‌ను కొట్టి గోల్ చేసే అవకాశాలను కోల్పోయింది. ఇంజ్యూరీ టైమ్‌లో జమైకాకు పెనాల్టీ లభించినా, VAR (Video Assistant Referee) ద్వారా ఆ నిర్ణయాన్ని తిరగరాయడంతో కురాకో ఊపిరి పీల్చుకుని, చారిత్రక అర్హతను దక్కించుకుంది. డచ్ కోచ్ డిక్ అడ్వొకాట్ (78 ఏళ్లు) మార్గదర్శకత్వంలో ఈ విజయం సాధించింది. ఆయన తన వయసులో ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన కోచ్‌లలో ఒకరు అయ్యే అవకాశం ఉంది.కురాకో విజయం.. ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక చిన్న దేశం సాధించిన అసాధారణమైన విజయ గాథగా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story