Jamie Smith: స్మిత్ 150..టెస్టా? టీ20నా.?
టీ20నా.?

Jamie Smith: భారత్ తో జరుగుతోన్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీ20 తరహాలో ఆడుతోంది. సిక్సులు,ఫోర్లతో విరుచుకుపడుతోంది. జెమీ స్మిత్ చెలరేగి ఆడుతోన్నాడు. టీ20 తరహాలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 144బంతుల్లోనే 150 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ 64 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 323 రన్స్ చేసింది. క్రీజులో బ్రూక్ 116 , స్మిత్ 150 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఇంకా 264 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.. శుభ్ మన్ గిల్ 269 పరుగులు,జైశ్వాల్ 87, జడేజా 89 పరుగులతో రాణించారు.
అంతకు ముందు స్మిత్ ముఖ్యంగా ప్రసిద్ కృష్ణకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ రెండు, మూడు బంతులకు సిక్సర్, ఫోర్ బాదిన ఈ ఇంగ్లీష్ వికెట్ కీపర్ చివరి మూడు బంతులను ఫోర్లుగా మలిచాడు. అంతటితో ఆగకుండా ప్రసిద్ వేసిన 34 ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదాడు. దీంతో 6 బంతుల్లోనే 28 పరుగులు పిండుకున్నాడు.
