విన్నర్ గా సౌతాఫ్రికా

WCL Championship: ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 విజేతగా సౌతాఫ్రికా చాంపియన్స్ నిలిచింది. ఫైనల్‌లో పాకిస్తాన్ చాంపియన్స్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 60 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో డివిలియర్స్ మొత్తం 3 సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నారు.

అంతకుముందు పాకిస్తాన్ చాంపియన్స్ 20 ఓవర్లలో 195/5 పరుగులు చేసింది. షర్జీల్ ఖాన్ (44 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) ఫిఫ్టీ కొట్టగా.. ఉమర్‌‌‌‌ అమిన్ (36 నాటౌట్‌‌), ఆసిఫ్ అలీ (28) రాణించారు. సఫారీ బౌలర్ల హర్డస్ విల్జోయెన్, వేన్ పార్నెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 196 పరుగుట టార్గెట్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 197/1 లక్ష్యాన్ని చేధించింది. జేపీ డుమినీ (50 నాటౌట్‌‌) , ఏబీ డివిలియర్స్ (120 నాటౌట్)తో చెలరేగడంతో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో ఇండియా చాంపియన్స్ సెమీ-ఫైనల్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story