మహిళా క్రికెటర్ ఎంగేజ్ మెంట్

South African women’s cricket all-rounder Chloe Tryon: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మహిళా క్రికెట,ఆల్-రౌండర్ అయిన క్లోయ్ ట్రయాన్ ఎంగేజ్ మెంట్ జరిగింది. క్లోయ్ ట్రయాన్ కంటెంట్ క్రియేటర్ మిచెల్ నేటివెల్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్రయాన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.దీంతో ఈ జంటకు ప్రముఖులు, క్రికెట్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుకు ఆల్‌రౌండర్‌. ఆమె కుడిచేతి వాటం బ్యాటింగ్‌తో దూకుడైన పవర్‌ హిట్టింగ్‌కు, నెమ్మదైన ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి.దక్షిణాఫ్రికా జట్టుకు వైస్ -కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2025 మే నెలలో శ్రీలంకపై జరిగిన ODI మ్యాచ్‌లో, ఆమె ఒకే మ్యాచ్‌లో 74 పరుగులు చేసి, 5 వికెట్లు తీసి ఒక అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన నమోదు చేశారు. ఈ ప్రదర్శనలో ఆమె హ్యాట్రిక్ కూడా సాధించారు, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచారు.క్లోయ్ ట్రయాన్ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లో ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ ఆమెను WPL 2025 సీజన్ కోసం రిటైన్ చేసుకుంది.ఆమె ఇటీవల ముగిసిన ICC మహిళల వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు తరపున ఫైనల్ వరకు ఆడింది. ఫైనల్లో భారత మహిళల జట్టు చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story