రీ ఎంట్రీ..

spinner Liam Dawson: ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మూడో టెస్టులో గాయడప్డ షోయబ్ బషీర్ స్థానంలో ఈ నెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టుకు అతను ఎంపికయ్యాడు. లార్డ్స్ టెస్టు ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో బషీర్ తన బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతని ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. అయినా బషీర్ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో బౌలింగ్ చేసి ఆఖరి వికెట్‌‌‌‌‌‌‌‌గా సిరాజ్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

అయితే, ఈ గాయం కారణంగా తను మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక35 ఏండ్ల డాసన్ తన చివరి టెస్టును 2017లో సౌతాఫ్రికాపై ఆడాడు. టెస్టు కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు 7 వికెట్లు పడగొట్టిన అతను కౌంటీ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో డాసన్ కు మంచి రికార్డుంది. 212 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 371 వికెట్లు తీశాడు. 18 సెంచరీలతో 10 వేల ప్లస్ రన్స్ చేశాడు. కాగా, ఇంగ్లండ్ టీమ్‌‌‌‌‌‌‌‌లోని పేసర్లు సామ్ కుక్, జామీ ఓవర్టన్‌ను రిలీజ్ చేయడంతో ఇద్దరూ తమ కౌంటీ జట్లకు తిరిగి వెళ్లారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story