T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక బోణీ
శ్రీలంక బోణీ

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 8న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో 163/6 పరుగులు చేసింది. టార్గెట్ బరిలో ఐర్లాండ్ స్కోరు19.5 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.కమిందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ (56)* అద్భుతమైన అర్ధ సెంచరీతో జట్టును ఆదుకోగా, కమిందు మెండిస్ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక స్పిన్నర్లు మహీష్ తీక్షణ (3/23), వానిందు హసరంగ (3/25) ఐర్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ (40), రాస్ అడైర్ (34) పోరాడినప్పటికీ, మిగిలిన వారు విఫలమవడంతో ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ విజయంతో శ్రీలంక ఈ మెగా టోర్నీలో తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది.

