T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో 105 రన్స్ తేడాతో శ్రీలంక విక్టరీ
శ్రీలంక విక్టరీ

T20 World Cup 2026: బ్యాటింగ్‌లో రాణించిన శ్రీలంక టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. కుశాల్ మెండిస్ (45 బాల్స్‌లో 7 ఫోర్లతో 61), పవన్ రత్నాయకే (28 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 60), డాసున్ షనక (20 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపడంతో.. గురువారం జరిగిన గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో లంక 105 రన్స్ తేడాతో ఒమన్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 225/5 స్కోరు చేసింది. స్టార్టింగ్‌లో ఒమన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాథుమ్ నిశాంక (13), కమిలి మిశ్రా (8) త్వరగా ఔటయ్యారు. దాంతో 42/2తో కష్టాల్లో పడిన లంకను కుశాల్, పవన్, షనక ఆదుకున్నారు. ఈ ముగ్గురు కలిసి 158 రన్స్ జోడించారు. చివర్లో కమింద్ మెండిస్ (19 నాటౌట్), దునిత్ వెల్లలాగే (6 నాటౌట్) బ్యాట్లు ఝుళిపించడంతో లంక భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. జితేన్ రమానంది 2 వికెట్లు తీశాడు.
ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 120/9 స్కోరుకే పరిమితమైంది. మహ్మద్ నదీమ్ (53 నాటౌట్) టాప్ స్కోరర్. వసీమ్ అలీ (27) కాసేపు అండగా నిలిచాడు. చమీరా (2/19), మహీశ్ తీక్షణ (2/11), వెల్లలాగే (1/17), దుశాంత్ హేమంత (1/45), కమింద్ మెండిస్ (1/10) బౌలింగ్ ముందు ఇన్నింగ్స్‌లో 9 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పవన్ రత్నాయకేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

