ఇండియా కబడ్డీ టీమ్ కోచ్ గా శ్రీనివాస్ రెడ్డి

Asian Games: ఇండియా కబడ్డీ టీమ్ కోచ్‌గా తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి 23 వరకు బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగనుంది. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కోచ్‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యారు.

గతంలో శ్రీనివాస్ రెడ్డి 2018లో దుబాయ్‌లో జరిగిన కబడ్డీ మాస్టర్స్ టోర్నీ కోసం భారత సీనియర్ పురుషుల కబడ్డీ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అతని కోచింగ్ పర్యవేక్షణలో భారత్ ఆ టోర్నీలో బంగారు పతకం గెలుచుకుంది. ఆయన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, ఉత్తరపల్లి గ్రామానికి చెందినవారు.ఆయన ఒక మాజీ అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు, 2005 ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం గెలుచుకున్నారు.

భారత జట్టుతో పాటు, ఆయన వివిధ అంతర్జాతీయ జట్లకు కోచ్‌గా పనిచేశారు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడలలో పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు (కొరియా కాంస్య పతకం గెలిచింది).

సీనియర్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.2016లో స్వర్ణ పతకం గెలిచిన భారత జూనియర్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.

2023 ఆసియన్ గేమ్స్‌లో బంగ్లాదేశ్ పురుషుల సీనియర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. ఆయన ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా ప్రముఖ కోచ్‌గా ఉన్నారు.గతంలో తెలుగు టైటాన్స్ , హర్యానా స్టీలర్స్ జట్లకు సహాయక కోచ్‌గా పనిచేశారు.జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story