England Squad for Second Test Against New Zealand: స్టోక్స్ అవుట్.. ఆర్చర్ ఇన్.. కివీస్‌తో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ఖతర్నాక్ టీమ్ రెడీ!
వీస్‌తో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ఖతర్నాక్ టీమ్ రెడీ!

England Squad for Second Test Against New Zealand: న్యూజిలాండ్‌తో బుధవారం నుండి ఓవల్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టును (ప్లేయింగ్ 11) అధికారికంగా ప్రకటించింది. గత మ్యాచ్‌తో పోలిస్తే జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బెన్ స్టోక్స్ మరియు గస్ అట్కిన్సన్ ఇద్దరూ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో (సస్పెండ్ అవ్వడంతో), వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ మరియు యువ ఫాస్ట్ బౌలర్ సన్నీ బేకర్ ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుకు సీనియర్ బ్యాటర్ జో రూట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ఈ ఇద్దరు కొత్త ఆటగాళ్లతో పాటు, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మాట్ ఫిషర్ చాలా కాలం తర్వాత మళ్లీ టెస్ట్ జట్టులోకి వచ్చారు. 2022 లో వెస్టిండీస్ పర్యటనలో తన తొలి టెస్ట్ ఆడిన ఫిషర్.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక నాలుగో ముఖ్యమైన మార్పు ఏమిటంటే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి రావడం. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున విపరీతంగా ఆడటంతో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఆయనకు మొదటి టెస్ట్‌లో విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు లండన్ పిచ్‌పై విరుచుకుపడేందుకు ఆర్చర్ సిద్ధమయ్యారు.
లార్డ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో 115 పరుగుల భారీ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఓలీ రాబిన్సన్.. కుడి మోకాలి నొప్పితో బాధపడుతుండటంతో ఈ రెండో టెస్టుకు దూరమయ్యారు. అలాగే లండన్‌లోని ఓవల్ మైదానం పేస్ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తుండటంతో, స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను ఈ మ్యాచ్ కోసం పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. కంప్లీట్ పేస్ ఎటాక్‌తో బరిలోకి దిగాలనే ప్లాన్‌తోనే ఇంగ్లాండ్ ఈ మార్పులు చేసింది.
జట్టు ఎంపికపై ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ.. ఈ పిచ్ మరియు వేదికను బట్టి చూస్తే మా జట్టు చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, మాట్ ఫిషర్ మరియు సన్నీ బేకర్‌లతో కూడిన మా పేస్ బౌలింగ్ విభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉందని, గాల్లోనే బంతిని విపరీతమైన వేగంతో విసరగల సత్తా వీరికి ఉందని ప్రశంసించారు. జట్టు సమతుల్యత (బ్యాలెన్స్) మారినప్పటికీ, ఓవల్ పిచ్ పరిస్థితులకు ఈ తుది జట్టు పక్కాగా సరిపోతుందన్నారు. అలాగే కొత్తగా జట్టులోకి వచ్చిన జోర్డాన్ కాక్స్ గురించి చెబుతూ.. ఆయన గత రెండేళ్లుగా జట్టుతోనే ఉన్నాడని, డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని తెలిపారు. పెద్ద మ్యాచ్‌లలో, క్రౌడ్ మధ్య చెలరేగి ఆడటం కాక్స్‌కు అలవాటని, ఇన్నింగ్స్ చివర్లో అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించడం ఖాయమని రూట్ చెప్పుకొచ్చారు.
- Ben StokesJofra ArcherEngland cricket teamNew Zealand cricket teamEngland CricketNew Zealand CricketTest CricketSecond TestCricket NewsSports NewsTeam SelectionEngland SquadArcher ComebackCricket UpdatesInternational CricketMatch PreviewCricket FansLatest Sports NewsLatest Telugu NewsTest SeriesEngland vs New Zealand

